*అభినందనలు తెలిపిన బాల్ రెడ్డి.
బలగం టివి, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పదవి బాధ్యతలు చేపట్టిన నూతన ఎమ్మెర్వో సురేష్,ఎంపీడీఓ భాస్కర్ శర్మలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ళ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు గజ్జెల రాజు,పట్టణ ఉపాధ్యక్షుడు ఎద్దెండి మహేందర్ రెడ్డి,మండల బీసీ సెల్ అధ్యక్షుడు ప్రశాంత్, మండల యూత్ అధ్యక్షుడు రంజాన్ నరేష్,పాక్స్ డైరెక్టర్ కొండల్ రెడ్డి గ్రామశాఖల అధ్యక్షులు రాజు, రమేష్,భాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కొండల్ రెడ్డి,వంశీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
