బలగం టివి , ,రుద్రoగి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఎంపీడీవో శంకర్ నాయక్ బదిలీపై జగిత్యాల జిల్లాకు వెళ్తున్న సందర్భంగా సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల కార్యదర్శుల,మండల పరిషత్ సిబ్బంది ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు..ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు తోటి సిబ్బందికి, గ్రామాల, మండల అభివృద్ధికి అందించిన సహాయ సహకారాలు,ఆయన సేవలను కొనియాడారు..