బలగం టివి, ,సిరిసిల్ల
జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి..
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బదిలీ అయిన ఎంపీడీవోలకు సిరిసిల్ల పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో
బదిలీ పై వెళ్తున్న ఎంపీడీవోలను జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మాట్లాడుతూ మాజీ సీఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జిల్లాలో ఎంపిడివో లు విజయవంతం చేశారనిఅన్నారు.ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు విషయంలో చాలా సమర్ధంగా పని చేశారని,గ్రామాల్లో ఎప్పటికప్పుడు పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసెలా ప్రతి ఒక్క కార్యదర్శి కి మార్గనిర్దేశనం చేస్తూ గ్రామాలు పచ్చదనంగా ఉండేలా కృషి చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, అడిషనల్ డిఆర్డి ఓ మదన్ మోహన్, ఎంపిడివో లు, అధికారులు పాల్గొన్నారు.