బలగం టీవి ..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబడ్డీ భారతదేశ సాంప్రదాయ క్రీడ అని గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం కలిగిన క్రీడ ఆలాంటి కబడ్డీ పోటీలను నిర్వహిస్తూ నూతన క్రీడాకారులను ప్రోత్సహించేలా రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో 20 కబడ్డీ జట్లతో పట్టణంలో నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు.
ప్రతి ఆటలో గెలుపు ఓటములు సహజమని గెలిచినవారు విర్రవిగాకుడదని ఓడిపోయిన వారు బాధపడకూడదని అన్నారు.
ఈరోజు ఈ పోటీల్లో పాల్గొన్న వారు భవిష్యత్తులో రాష్ట్ర ,జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని రాజన్న సిరిసిల్ల జిల్లా కు మంచి పేరు తీసుకురావాలని అన్నారు కేవలం కబడ్డీ మీద ఆసక్తితో కాకుండా కబడ్డీ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ గెలుపు కోసం ప్రతి ఒక క్రీడాకారుడు ఇష్టంతో కష్టపడి ఆడాలని అన్నారు..
గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుండి క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే వచ్చారు క్రీడాకారులకు అన్ని రకాల సహాయ సహకారాలను బహుమతులను అందజేశారు అదేవిధంగా విద్య ఉద్యోగ విషయాలలో కూడా క్రీడాకారులకు ప్రత్యేక కోటను కల్పిస్తున్నారు అని అన్నారు..
ఈ జిల్లా స్థాయి పోటీల తర్వాత గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొని మన జిల్లా క్రీడాకారులు మొదటి స్థానంలో నిలిచి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు..
అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి సహకారంతో సిరిసిల్ల పురపాలక సంఘం వారు సిరిసిల్లలో అన్ని వసతులతో మినీ స్టేడియం ను ఏర్పాటు చేశారు అదేవిధంగా దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో జూనియర్ కళాశా మైదానాన్ని కూడ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు
భవిష్యత్తులో ఇలాంటి టోర్నమెంట్లు సిరిసిల్లలో నిర్వహించడం కు మా తరఫున మా పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
బాలుర విభాగంలో మొదటి స్థానంలో ఇచ్చిన నూకలమర్రి జట్టు ను రెండవ భాగంలో నిలిచిన.. అనుపురం జట్టును, బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన తంగళ్ళపల్లి జట్టును రెండో స్థానంలో నిలిచిన సిరిసిల్ల జట్లను అభినందించి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ సభ్యులు గెంట్యాల శ్రీనివాస్ గారు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తిరుపతి గారు, సిరిసిల్ల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు నారాయణ గారు, కార్యదర్శి మధుగారు, దేవులపల్లి ప్రభాకర్ రావు గారు,కబడ్డీ క్రీడా అభిమానులు మరియు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
