బలగం టివి , ఇల్లంతకుంట
ఇల్లంతకుంట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన గౌరవ సర్పంచ్ లను ఇల్లంతకుంట ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి శాలువాతో సత్కరించి సన్మానించారు . సర్పంచ్ల పదవీకాలం నేటితో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, వారికి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సర్పంచ్ వ్యయ,ప్రయాసలను భరించి గ్రామ అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడ్డారన్నారు. చేసిన పనులకు బిల్లులు వచ్చిన, రాకున్నా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగారని ఆయన కొనియాడారు.
గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర ,గ్రామపంచాయతీ పాలకవర్గం పాత్ర కీలకమన్నారు.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజంగా ఉంటాయని, సర్పంచులు కూడా అదే విధంగా స్ఫూర్తితో పాలను అందించారని గుర్తు చేశారు. గౌరవ సర్పంచులు గ్రామ, మండలం అభివృద్ధికి కృషి చేసినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీడీవో మీర్జా , గౌరవ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ , ఆయా గ్రామాల గౌరవ సర్పంచులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
