బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
ఎల్లారెడ్దిపేట మండల కేంద్రంనకు చెందిన మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత -బాలరాజ్ యాదవ్ దంపతుల కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ మంగళవారం వెలువడిన ఇంటర్మిడియట్ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాలు వెలువడగా బై పి సి లో 435/440 రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించగా ఒగ్గు శ్రీనిధి యాదవ్ ను బొప్పపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ శాలువా కప్పి అభినందించారు. ఒగ్గు శ్రీనిధి యాదవ్ నర్సరీ నుండీ అయిదవ తరగతి వరకు కిషన్ దాస్ పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, ఆరవ తరగతి నుండీ పదవ తరగతి వరకు ఎల్లారెడ్దిపేట లోని జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో చదువు కుంది. కుమారుడు ఒగ్గు వికాస్ యాదవ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అఫ్ సైన్సెస్ ఇంజనీరింగ్ కళాశాలలో సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్మీడియట్ కరీంనగర్ లోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బై పి సి చదువుతున్న ఒగ్గు శ్రీనిధి యాదవ్ ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షలలో హల్ టికెట్ నంబర్ 2535103822 రాసి రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించింది. భవిష్యత్ లో నీట్ పరీక్ష రాసి ఎంబిబిఎస్ లో సీటు సాధించి తల్లిదండ్రుల పేరు నిలబెట్టి డాక్టర్ గా సేవలందించాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా ఎల్లారెడ్దిపేట మాజీ ఉపసర్పంచ్ దంపతులను అయన అభినందించారు.