*పదవి లేకున్నా ప్రజలతోనే ఉంటా సర్పంచ్ భాగ్యశ్రీ.
*గ్రామాభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
బలగం టివి ,ముస్తాబాద్,

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దకుంట గ్రామం సర్పంచ్ జనగామ భాగ్యశ్రీ శరత్ రావు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఆత్మీయ సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ శరత్ రావు మాట్లాడుతూ పదవి బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ పంచాయితీ సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులకు శాలువాలతో సన్మానించి సత్కరించారు.ఈ ఐదు సంవత్సరాలలో మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో రైతు వేదిక,ప్రగతి భవన్,నూతన గ్రామ పంచాయతీ భవనం,పల్లె ప్రకృతి మనం,ఆఖరి మజిలీలో గౌరవంగా ఖననం చేయడానికి వైకుంఠ దామం,పచ్చని చెట్లతో మన గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. దేశంలోనే ఇరవై గ్రామ పంచాయతీలకు ఉత్తమ అవార్డులు వస్తే తెలంగాణకు పది అవార్డులు వచ్చాయని అందులో మన గ్రామానికి కూడా అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. ఇదంతా గ్రామస్తుల సహకారం గ్రామపంచాయతీ సిబ్బంది పాలకవర్గం సమిష్టి సహకారంతోనే సాధ్యమైందని వెల్లడిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.సమన్వయంతో గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎంతగానో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆత్మీయ సత్కారం చేసి మెమొంటోలను అందజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గం,పంచాయతీ సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.