రాజన్న సిరిసిల్ల జిల్లా మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానం..

0
563

గ్రామాన్ని పాలించే అధికారం రాజ్యాంగం ఇచ్చింది… రాష్ట్ర ఫుడ్ కమిషన్ నెంబర్ ఓరుగంటి ఆనంద్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో పెద్దూరు వద్ద గల జీకే ఫంక్షన్ హాల్ లో సిరిసిల్ల జిల్లా స్థాయిలో మాదిగ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ నెంబర్ ఓరుగంటి ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు కేంద్ర బిందువు గ్రామపంచాయతీ ఎన్నికలు. గ్రామానికి దూరంగా ఉన్న అట్టడుగు కులాలు భారత రాజ్యాంగం ద్వారా గ్రామ ప్రజా ప్రతినిధులు కావడానికి అవకాశం ఏర్పడింది. కావున ఎంపికైన పాలకవర్గం బాధ్యులు గ్రామ బడుగు బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక ప్రగతిలో కీలకపాత్ర పోషించాలన్నారు. అంబేద్కర్ ఫూలే ఆలోచన విధానంతో సమాజాన్ని పరివర్తన చేయాలన్నారు. ఈ దేశాన్ని పాలించిన ఆది జాంబవంతుని వారసులుగా మాదిగ జాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. యువతను సన్మార్గంలో పెట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాదిగ జాగృతి సంఘ బాధ్యులు మంద బాబు, కేసు గాని దేవయ్య, పరమేశ్వరి, కమటం మల్లయ్య, సంపతి రమేష్, చుంచు మహేష్, శేఖర్, రామస్వామి, భీమ్ ప్రకాష్ , భీమ్ కీర్తన మహారాణి, అనిల్, బాబు, అరుణ్,వేణు,శ్రీధర్ రాజశేఖర్ మరియు గ్రామాల్లో ఎంపికైన సర్పంచ్‍, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here