బలగం టీవీ, హైదరాబాద్:
హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం హయత్ నగర్‌లోని తన నివాసంలో ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. కృష్ణ చైతన్యను కుటుంబ సభ్యులు వెంటనే ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.