ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
బలగంటివి,వేములవాడ:
ఎన్నికల్లో నా గెలుపు కోసం కష్టపడ్డా ప్రతి ఒక్కరిని చూశానని, అందర్నీ కడుపులో పెట్టుకొని చూసుకుంటానని ,ప్రజల ఆశీర్వాదాం వల్ల మన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంనకు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే , ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు.. ఏన్నికల ప్రచారం సమయంలో మనం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు.. సమస్యల పరిష్కారానికి మనందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ నుండి అత్యధిక మెజారిటీ ఇద్దాం అని, ఏ ఎన్నిక జరిగిన అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు పోదాం అన్నారు..వేములవాడ నియోజకవర్గంలో పాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం అన్నారు .నా గెలుపులో భాగస్వామైనా ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటాను అన్నారు..