సొంత ఊరికి రెగ్యులర్‌గా వస్తా.. గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటా..

0
128

నాన్న ఎప్పుడూ అడిగేవాడు.. ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు..

అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది.. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది..

ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది.

ఇక నుంచి రెగ్యులర్గా వస్తా.. ఊరికి చేసేది చాలా ఉంది..

  • ప్రముఖ సినీ హిరో విజయ్ దేవరకొండ

బలగం టీవీ, నాగర్ కర్నూల్:

పెళ్లి అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి సొంత గ్రామానికి వెళ్లిన ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, బల్మూర్ మండలంలోని తుమ్మన్‌పేట ఆయన స్వగ్రామం.

గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంటికి గృహప్రవేశం నిర్వహించిన అనంతరం సత్యనారాయణ వ్రతం చేశారు. ఈ సందర్భంగా తన జీవిత భాగస్వామి ప్రముఖ నటి రష్మిక మంధాన తో కలిసి ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.

సొంత ఊరు తుమ్మన్‌పేటతో నాకు ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. నా మొదటి పుట్టిన రోజు ఇక్కడే జరిగింది. తర్వాత కుటుంబం ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు మారింది. నాన్న ఎప్పుడూ ‘ఊర్లో పొలం కొందాం, వ్యవసాయం చేద్దాం’ అనేవారు. అమ్మ ‘ఇల్లు కట్టుకుందాం’ అని చెప్పేది. ఈరోజు ఆ కోరిక నెరవేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం, పెళ్లి జరగడం ఒకేసారి కావడం మరింత సంతోషాన్ని ఇస్తోంది,” అని పేర్కొన్నారు.

ఇక నుంచి గ్రామానికి రెగ్యులర్‌గా వస్తామని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమ్ముడు ఆనంద్ పెళ్లిని కూడా గ్రామంలోనే అందరి సమక్షంలో నిర్వహిస్తామని తెలిపారు. ఊరికి చేసేది చాలా ఉందని, అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందాం. అదే విధంగా దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here