గ్రామంలో అసంపూర్తిగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తాను..

0
61
  • అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తాను..
  • సర్పంచ్ అభ్యర్థి సుద్దాల మధు

బలగం టీవీ, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనిపల్లి మండలం జగ్గారావుపల్లి సర్పంచ్ గా తనను గెలిపేస్తే ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా గ్రామ అభివృద్ధికి పాటు పడతానని సర్పంచ్ అభ్యర్థి సుద్దాల మధు తెలిపారు. గ్రామస్తులతో, మహిళలతో, యువకులతో కలిసి సుద్దాల మధు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నెల 14 న ఎన్నికల్లో తన గుర్తు కత్తెర గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నాడు. యువత, మహిళలు, గ్రామస్తులు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వేడుకున్నాడు.గ్రామంలో అసంపూర్తిగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని గ్రామ ప్రజల ఆశలు వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని, కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. సుద్దాల మధుకు మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here