ప్రచారంలో దూసుకుపోతున్న నీలోజిపల్లి సర్పంచ్ అభ్యర్థి అనుముల భాస్కర్
బలగం టీవీ, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి అనుముల భాస్కర్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు.
నీలోజిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఈనెల 14న జరిగే సర్పంచి ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి, భారీ మెజార్టీ ఇయ్యాలని ఓటర్లను వేడుకుంటున్నాడు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఓటరు దగ్గరకు వెళ్లి ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే, ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నీలోజిపల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా వెన్నంటుంటానని అన్నారు. ప్రధాన సమస్య అయిన ఐదు లక్షల 4 వేల రూపాయలు ఇప్పించేలా కృషి చేస్తానని అన్నారు. సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనుముల భాస్కర్ తో ప్రచారానికి యువత, మహిళలు భారీ సంఖ్యలో వచ్చి ఆయన గెలుపుకు కృషి చేస్తున్నారు.

