షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలని ఆదేశం
బలగం టీవీ, హైదరాబాద్:
ఐబొమ్మ రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు పలు కఠిన నిబంధనలు విధించింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం, రవి ప్రతి రోజు సీపీఎస్ అధికారుల ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. విచారణకు పూర్తిగా సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా, దేశం విడిచి వెళ్లరాదని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరింతగా, తన పాస్‌పోర్ట్‌ను సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించాలని హైకోర్టు సూచించింది. విధించిన షరతులను ఉల్లంఘించిన పక్షంలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందని కోర్టు హెచ్చరించింది.
