బలగం టీవీ,రాజన్న సిరిసిల్ల :
ఏపీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న పై కంచర్ల రవి గౌడ్ ధ్వజం
ఈ రోజు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆద్వర్యం లో తెలంగాణ భవన్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
తను మాట్లాడుతూ నిన్నటి రోజున కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి అని క్షమాపణలు చెప్పాలని హెచ్చరించడం జరిగింది. అయ్య వెంకన్న కేటీఆర్ ని విమర్శించే స్థాయి నిది కాదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని లేక పోతే నాలుక చిరేస్తం అని హెచ్చరించడం జరిగింది.
ఏదైనా రాజకీయం చేయాలి అనుకుంటే మీ ఆంధ్రప్రదేశ్ లో చేసుకో కాని కేటీఆర్ ని కాని తెలంగాణ ప్రజల మీద మాట్లాడే అర్హత నికు లేదు అని. మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీ అడిగి తెలుసుకో కేటీఆర్ అంటే ఏంటో చెప్పుతాడు అని తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగం లో ప్రపంచం లో అగ్రగామిగా నిలబెట్టిన కేటీఆర్ గూర్చి మాట్లాడే అర్హత నికు లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని. మళ్ళీ తెలంగాణ లో పాత రోజులు తేవాలని చంద్రబాబు నాయుడు కలలు కంటున్నరు అని, అది కలగానే మిగిలిపోతుంది అని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం అప్పుడు ఇప్పుడు పోరాడేది కొట్లేడేది కేసీఆర్ బీఆరెస్ పార్టీ మాత్రం అని. బిడ్డ వెంకన్న కేటీఆర్ అని సెలబ్రెటీ అవుదాం అని అనుకుంటే అది కాదు అని .తెలంగాణ లో ఎక్కడ కనపడ్డ నిన్ను అడ్డుకుంటాం అని హెచ్చరించడం జరిగింది.
సిరిసిల్ల లో ఏ గ్రామానికి వెళ్లిన ఏ గల్లికి వెళ్లిన తెలంగాణ ఏర్పడ్డాక కేటీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెపుతాయి కేటీఆర్ అంటే ఏంటో అని సిరిసిల్ల రూపు రేఖలు మార్చిన ఘనత మా రామన్న ది అని. అప్పటి ఉరిశాల నీ సిరిశాల గా మార్చిన ఘనత మా ఎమ్మెల్యేది అని. తెలంగాణ లోనే కాదు ప్రపంచంలో కేటీఆర్ కానీ తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ తెలియని వాళ్ళు వుండరు. అలాంటి గొప్ప వ్యక్తినీ దూషించే నైతికత నీకు కానీ మీ టిడిపి నాయకులకి లేదు అని ఇప్పటికైనా నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి అని బేషరతుగా కేటీఆర్ కి క్షమాపణలు చెప్పాలని హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, కొడం వెంకటేష్,నవీన్,రుద్రవీణ సుజిత్, గాజుల మహేష్,అడుచర్ల సాయి,కాసర్ల వినయ్, తదితరులు, పాల్గొన్నారు.