-ఎస్ ఐ అశోక్..
బలగం టీవి , ,రుద్రంగి:
అటవీ జంతువుల వేట కోసం విద్యుత్ కంచె అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని రుద్రంగి ఎస్ఐ అశోక్ అన్నారు..రూప్లనాయక్ తండా కు చెందిన గుగులోతు తిరుపతి అనే వ్యక్తి తన పంటచేను వద్ద అడవి జంతువుల వేట కొరకు పెట్టిన విద్యుత్ కంచకు తగిలి గుగులోతు హరిసింగ్ యొక్క గేదె మృతి చెందగా హరిసింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి విచారణ చేపట్టి గుగులోత్ తిరుపతిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.. వారు మాట్లాడుతూ రుద్రంగి మండల ప్రజలు ఎవరైనా అడవి జంతువుల వేట కొరకు కానీ లేదా పంట పొలాల రక్షణ కొరకు కానీ అక్రమంగా విద్యుత్ కంచెను అమర్చడం ద్వారా ఆ కంచ తగిలి మనుషుల ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు.సోమవారం భూపాలపల్లి జిల్లాలో కూంబింగ్ కు వెళ్లిన ఒక కానిస్టేబుల్ మరణించిన విషయాన్ని గుర్తు చేశారు.. రుద్రంగి మండల పరిధిలో గతంలో కూడా అక్రమంగా ఏర్పరిచిన విద్యుత్ కంచెలకు తగిలి విద్యుత్ షాక్ కు గురై చాలామంది చనిపోయారు అన్నారు.. ఎవరు కూడా వేట కోసం గానీ, మరే ఇతర అవసరాల కోసం గానీ అక్రమంగా విద్యుత్ కంచెను వేయకూడదని,అలా చేసినచో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు..