వేములవాడ యువ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ సంచలన వాఖ్యలు
వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో యువ సమ్మేళనాలు
భారతదేశంలో సిరిసిల్ల నియోజకవర్గంని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతా
మీ సంపూర్ణ మద్దతుతోనే నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి: మంత్రి కేటీఆర్
యువ సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు
యువ సమ్మేళన కు భారీగా తరలివచ్చిన యువకులు
వేములవాడ అభ్యర్థి లక్ష్మీనరసింహా రావును గెలిపించాలి
సిరిసిల్ల న్యూస్:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ యువ సమ్మేళన సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. వేములవాడ సభలో మంత్రి కేటీఆర్ సంచలన వాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు మీ భౌవిష్యత్ తలరాతలు మార్చుకునే ఎన్నికలని, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును అత్యధిక మేజార్టీతో గెలిపించాలన్నారు.గెలిపిస్తే వేములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుకోని అభివృద్ది చేస్తానని, లేకపోతే వేములవాడ వైపు రానని, అడుగుపెట్టనని సంచలన వాఖ్యలు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని సోమవారం రోజు గాయత్రి డిగ్రీ కాలేజ్ వెనకాల మైదానం మైదానంలో ఏర్పాటు చేసిన యువ సమ్మేళనకు యువతీ యువకులు భారీగా తరలివచ్చారు.ఆటపాటలతో కళాబృందం వారు అలరించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…. త్యాగాలతో ఎన్నో పోరాటాలతో మీ అందరి సమిష్టి కృషితో మనందరి సమిష్టి కృషితో మరి సాధించుకున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సరిగ్గా తొమ్మిది నెలల కిందట సవ్యమైన పద్ధతిలో నడపాలని ఉద్దేశంతో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ ఎన్నడూ కూడా ఒక్కరోజు మరి కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు..? మతం పేరు మీద మంటలు పెట్టలేదు..? ప్రాంతం పేరుమీద పంచాయితీ పెట్టలేదు..? ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు కేవలం అభివృద్ధి సంక్షేమమే నా మతం అని బ్రాహ్మణంగా బ్రహ్మాండంగా ప్రతి వ్యవస్థని బాగు చేసే ప్రయత్నం చేసింది మన ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్.దానికి గొప్ప ఉదాహరణ మన రాజన్న సిరిసిల్ల జిల్లా నే మన నియోజకవర్గమే దరువు ఎల్లం ఇప్పుడే చెప్పారు. మేము మానేరు కాడికి పోయేది ఇవాళ గర్వంగా చెప్పొచ్చు సిరిసిల్ల బిడ్డ చెప్పచ్చు మా నమాల చెరువు ఇయాల కాలేశ్వరం పుణ్యమా అని బ్రహ్మాండంగా ఎర్రటి ఎండల్లో కూడా మత్తడి దుంకుతున్నదని అన్నారు. కడుపునిండా కరెంటు బ్రహ్మాండమైన సంక్షేమం ఒకవైపు పట్టణాభివృద్ధి మరొకవైపు పల్లెల అభివృద్ధి సమగ్రంగా ఒక ఆలోచనతో ఇవాళ ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లా కాదు రాష్ట్రంలోని ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి పట్టణాన్ని బ్రహ్మాండంగా చేసుకునే ప్రయత్నంలో తొమ్మిదిన్నరలుగా మీ ఆశీర్వాదం సంపూర్ణంగా నాకు లభించింది. 2009లో నేను ఇక్కడ అడుగు పెట్టినప్పుడు దాదాపు 15 ఏళ్ల కిందట చాలామందికి తెల్వదు కేవలం కేసీఆర్ కొడుకు అని మాత్రమే తెలుసు కానీ ఈరోజు 15 ఏళ్ల తర్వాత నేను ఒక్క మాట మాత్రమే మీకు చెప్పగలుగుతా. నేనెందో మీకు తెలుసు మీరు ఏందో నాకు తెలుసు కాబట్టే సంపూర్ణమైన విశ్వాసంతో పదిహేను సంవత్సరాలు మీ బిడ్డగా మీ ఎమ్మెల్యేగా మీరు తలెత్తుకునే విధంగా పనిచేసిన తప్ప ఎక్కడ కూడా తలదించుకునే విధంగా మాత్రం పని చేయలేదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

ఈ దేశంలో ఏ రాష్ట్రానికి పోయిన ఏ నగరానికి పైన ప్రపంచంలో ఏ దేశానికి పోయిన చెప్తా ఎక్కడి ఎమ్మెల్యే నువ్వంటే సిరిసిల్ల ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకునే బిడ్డను నేను.ఇవాళ నిజంగా కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు జన్మనిచ్చింది మా అమ్మగారు అయితే రాజకీయంగా నాకు జన్మనిచ్చింది సిరిసిల్ల గడ్డ దీని రుణం తీర్చుకునే బాధ్యత నా మీద ఉన్నది.భారతదేశంలో నెంబర్ వన్ గా ఈ సిరిసిల్ల నిలబెట్టేదాకా మీ బిడ్డగా మీ ఎమ్మెల్యేగా మీ ప్రతినిధిగా తప్పకుండా నెరవేరామంగా మీ దయతో పనిచేస్తూ ఉంటా నాకు విశ్వాసం ఉంది మీకు తెలుసు నేను ఇవాళ పార్టీ యొక్క కార్య నిర్వాహక అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్న ప్రతి ఒక్కరికి కలవలేకపోవచ్చు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఓటు అడగలేకపోవచ్చు ప్రజా ప్రతినిధులను మా అన్నదమ్ములందరినీ ఆత్మీయంగా నేను అడిగేది ఒకటే నేను ఈ 15 ఏళ్ల పాటు మీరు తలెత్తుకునే విధంగా పనిచేసిన అని మీకు అనిపిస్తే తప్పకుండా దయచేసి ఈనెల 30వ తారీఖు నాడు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించి నన్ను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, బోయినపల్లి వినోద్ కుమార్,టేస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు,జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు,ప్రాథమిక వ్యవసాయ సంఘ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్, మండల అధ్యక్షుడు వరుస కృష్ణ హరి, పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి, ఎంపీటీసీలు,చుట్టుపక్క గ్రామాల సర్పంచులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు,మూడు మండలాల యూత్ సభ్యులు పాల్గొన్నారు.