బలగం టీవి , రాజన్న సిరిసిల్ల
రైస్ మిల్లర్ లకు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హుకుం
కలెక్టరేట్ లో సమావేశం
సిరిసిల్ల జనవరి 19, 2024 :

రానున్న 12 రోజుల్లో సీఎంఆర్ లక్ష్యం చేరకపోతే సంబంధిత రైస్ మిల్లర్ లకు జరిమానా విధిస్తామని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హెచ్చరిoచారు. సీఎంఆర్ సరఫరాఫై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లాలోని రా, బాయిల్ రైస్ మిల్లర్ లతో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2022-23 సీజన్ సీఎంఆర్ 12 రోజుల్లో ఇవ్వాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. గడువులోగా సీఎంఆర్ ఇవ్వకపోతే జరిమానా వేస్తామని, నిబంధనలు ఉల్లoఘించే వారిఫై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎంఆర్ రవాణాలో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ భరోసా ఇచ్చారు. రైస్ మిల్లులో బియ్యం మర పట్టించడం, తరలింపును పర్యవేక్షిoచేoదుకు ఒక టీంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమీక్షలో జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, రైస్ మిల్లుల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల చే జారీ చేయనైనది.