బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ధర్నా పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పోలీస్ వారి విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురు వ్యక్తులు రిమాండ్.
చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు..
ఈ సందర్భంగా చందుర్తి సి.ఐ మాట్లాడుతూ… సోమవారం రోజున కోనరావుపేట మండలం రామన్నపల్లి h/o బావుసాయిపేట్ గ్రామానికి చెందిన బత్తుల మల్లయ్య అనే వ్యక్తి బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు రోడ్డుపై పడి తలకి దెబ్బ తగిలి తేదీ 19.01.2025 రోజున చనిపోగా అతడి భార్య బత్తుల రేనవ్వ తేదీ 20.02.2025 రోజున నాంపల్లి గ్రామంలో ఉరివేసుకుని చనిపోగా వారిద్దరి చావులకి అదే గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య అనే వ్యక్తి కారణమంటూ బావుసాయిపేట్ గ్రామానికి చెందిన బత్తుల యెల్లయ్య,బత్తుల అంజయ్య,బత్తుల కొమురయ్య ,బత్తుల రాజయ్య, బత్తుల చిన్న భీమయ్య @ బత్తుల భీమయ్య, రామన్నపల్లి h/o బావుసాయిపేట్ వీరితో పాటుగా మరికొంతమంది చనిపోయిన బత్తుల రేనవ్వ శవాన్ని నాంపల్లి గ్రామం నుండి రామన్నపల్లి గ్రామానికి తీసుకెళ్ళి బత్తుల అంజయ్య అతని సోదరులయిన బత్తుల ఆగయ్య, బత్తుల రాములు,బత్తుల లచ్చయ్య అనే వారి ఇళ్ల ముందు పెట్టి వారి ఇండ్లపై దాడికి పాల్పడి ఇళ్లలోని వస్తువులని ద్వంశం చేస్తుండగా కోనరావుపేట పోలీస్ వారు వెళ్ళి ఆపగా అయిన గాని వినకుండా పోలీస్ వారి విధులకు ఆటంకం కలిగించగా తేదీ 22.02.2025 రోజున వారిపై కేసు నమోదు చేసి తేదీ 03.03.2025 రోజున వారిని రిమండ్ కి తరలించడం జరిగిందని చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పిర్యాదు చేయాలని, అట్టి సమస్యపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. చట్టాన్ని తమ చేతులోనికి తీసుకుని రోడ్ల మీదకు వచ్చి సామాన్య ప్రజానీకానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠిన వ్యవహరిస్తామని సి.ఐ హెచ్చరించారు.