దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి..

0
99

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

బీఆర్ఎస్ నేత మాట్ల మధు..

రాజన్నసిరిసిల్ల జిల్లాలో పంచాయతీ సెక్రటరీలపై కాంగ్రెస్ నాయకులు అనవసర ఒత్తిడి తెస్తున్నారని బీఆర్ఎస్ నేత మాట్ల మధు ఆరోపించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్ల మధు మాట్లాడుతూ.. బద్దెనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కాంగ్రెస్ నాయకుల ఒత్తిడే కారణమని, ఒక మహిళా కార్యదర్శిని మానసిక క్షోభకు గురిచేసి, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించేలా వ్యవహరించారని ఆరోపించారు. ఇందిరమ్మ ప్రజా పాలన పేరుతో మహిళలపై అన్యాయం జరుగుతోంది. కాంగ్రెస్ నాయకులు స్వంత లాభం కోసం అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడినా, సర్పంచులు లేకపోయినా, స్వంత ఖర్చులతో పంచాయతీ కార్యదర్శులు గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నారు. వారిని చులకనగా చూడటం, అవమానించడం సరికాదు” అని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కూడా సెక్రటరీలపై ఒత్తిడి తెస్తూ, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దమ్ము దైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి. అధికారులపై మీ ప్రతాపం చూపడం కాదు అని సవాల్ విసిరారు. పంచాయతీ కార్యదర్శులకు అండగా ఉంటామని, వారి తరఫున చట్టపరంగా పోరాడుతామని హామీ ఇచ్చారు. మిస్సింగ్ అయిన కార్యదర్శి క్షేమంగా తిరిగి రావాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here