డిఆర్డిఏ పీడీని కలిసిన ఇఫ్కో ప్రతినిధులు..

0
284

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా డిఆర్‌డిఏ (DRDA) ప్రాజెక్ట్ డైరెక్టర్ శేషాద్రిని కరీంనగర్ జిల్లా సమగ్ర రైతు సహకార సంస్థ (IFCO) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా, జిల్లాలో చేపట్టబోయే ఇఫ్కో కార్యక్రమాలపై జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ జి. స్వప్న రెడ్డి వివరించారు. మహిళా సాధికారత, ఆర్థిక అక్షరాస్యత కోసం స్వయం సహాయక బృందాలైన (SHG) మహిళలకు జీవనోపాధి మార్గాలను కల్పించడంలో ఇఫ్కో (IFCO) కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వారి శ్రద్ధాసక్తులను బట్టి వివిధ రకాల వస్తువుల తయారీలో శిక్షణ ఇవ్వడం, వారిలో సామర్థ్యాన్ని పెంచి ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.

ప్రభుత్వం అందించే రుణ సదుపాయాన్ని సక్రమమైన మార్గంలో వినియోగించి ఉపాధిని పెంచేందుకు కావాల్సిన నైపుణ్యాన్ని అందించడం, వారు తయారు చేసే వివిధ వస్తువులను బహిరంగ విపణిలో విక్రయించుటకు తగిన మార్కెట్ మెలకువలను తెలియజేసి వారికి ఆర్థిక లాభాలు వచ్చేలా ప్రోత్సహిస్తామని, అభివృద్ధికి దోహదపడే విధంగా ఇఫ్కో పథకాలు మహిళలకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

ఈ సమావేశంలో ఇఫ్కో (IFCO) అడ్మిన్ మేనేజర్ భాగ్యలక్ష్మి, డివిజన్ మేనేజర్ జింక నాగరాజు, మరియు ఎం.ఈ లు సాదియా, లక్ష్మణ్, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here