మండల సిపిఎం పార్టీ శాఖ డిమాండ్
బలగం టివి,, బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభంపెల్లి గ్రామం దగ్గర నుండి గత కొన్ని రోజులుగా అక్రమ మట్టి తరలింపు లారీల ద్వారా పర్మిషన్ లేకుండా పాలకులు అండదండలతో లారీల ద్వారా ఇటుక బట్టీలకు తరలించకపోవడం జరుగుతుంది.
మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ మాట్లాడుతూ: అక్రమ మట్టి తరలింపు వల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కోట్ల రూపాయలలో ఆదాయానికి గండి కొడుతూ ప్రకృతి జాతి సంపాదన కొల్లగొడుతున్నారు. మట్టి మాఫియా,ఈ మండల కేంద్రంలో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఉన్న చెరువుల నుంచి మట్టిని, పెద్ద ఎత్తున అనాధికార పర్మిషన్ల పేరిట లారీల ద్వారా తరలించకపోతున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చొప్పదండి ఎమ్మెల్యే ఈ మండలం మీద దృష్టి పెట్టి,మట్టి తరలిస్తున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఈ సందర్భంగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, నాయకులు రామంచ అశోక్ తదితరులు పాల్గొన్నారు.