పరిశీలించిన మైనింగ్ అధికారులు
వారిపై తగిన చర్యలు తీసుకుంటాము
బలగం, బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని శివారులో వేములవాడ రహదారిలో డంప్ చేసిన అక్రమ మట్టిని లారీల సహాయంతో తరలిస్తున్నారని సమాచారం అందడంతో మైనింగ్ అధికారులు గురువారం రోజున డంపింగ్ చేసిన మట్టిని, పరిసర ప్రాంతాలను మైనింగ్ అధికారి రఘుబాబు తన సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మైనింగ్ అధికారి రఘుబాబు మాట్లాడుతూ: లారీలను, ప్రోక్లైన్ ను వెనక్కి పంపించి,ఈ మట్టిని ఎక్కడి చెరువులో నుండి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి,దీనిని లారీల సాయంతో ఇప్పుడు బయటకు తీసుకు వెళుతున్నారన్నారు. అక్రమ మట్టి మాఫియాపై మైనింగ్ అధికారులు ఎప్పటికప్పుడు నిగా ఉంటుందని అన్నారు.ఈ మట్టిని డంప్ చేసిన వారు ఎవరు, మట్టి నిల్వ చేసిన భూమి ఎవరిది అని, తెలుసుకొని తగు చర్యలు తీసుకుంటామని, ఈ అక్రమ మట్టిని తరలించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.