అక్రమ మద్యం నిల్వ..

0
51

అనంతపల్లిలో అక్రమ మద్యం స్వాధీనం..

రూ. 4,400 విలువ చేసే సీసాలు పట్టివేత..

మండల ఎస్సై ఎన్. రమాకాంత్

బలగం టీవీ, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన పర్ష వేణుకుమార్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచుతున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు, బోయినిపల్లి ఎస్‌.ఐ ఎన్.రమకాంత్ తన సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించారు. తనిఖీలో రూ. 4,400/- విలువ గల అక్రమ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మద్యాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, అక్రమ మద్యం నిల్వ చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌.ఐ రమాకాంత్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్‌ఐ రమాకాంత్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here