బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- ప్రొద్దున లేచి ఎవరిని ముంచాలనీ ఆలోచించే మీరా నన్ను విమర్శించే సన్నాసులు
- రెండు సార్లు సర్పంచ్ గా గెలిచినా..నీ మొహానికి వార్డు మెంబర్ గానైన గెలువు
– బీఆర్ఎస్ నాయకుడు మాట్ల మధు
కేకే మహేందర్ రెడ్డి పెంపుడు కుక్కలు,నా మీద,మా నాయకుడీని తిడితే ఊరుకుంటామ,నీ అనుచరులకు తాగి పిచ్చి పోన్ లో బెదిరింపులకు పాల్పడుతే భయపడే ప్రసక్తే లేదు అని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్ల మధు అన్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల మాట్ల మధు మాట్లాడుతూ సాగు నీళ్ళు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే మంత్రి, అధికారులతో మాట్లాడి రైతులకు అండగా నిలిచిన వ్యక్తి కేటీఆర్ అని,పోయినా సంవత్సరం రంగనాయక సాగర్ ద్వారా మండలానికి నీళ్లు ఇచ్చింది కేటీఆర్ అని,నువ్వే కదా ఒప్పుకుందని అన్నారు.
ఐదుసార్లు ఓడిపోయాననే అక్కసుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని, పార్టీకి సంబంధం లేని ఓ సామాన్య రైతు ను జైల్లో పెట్టించిన సంస్కృతి మీది అని అన్నారు. నీ లెక్క డబ్బులు తీసుకొని పోటీలో నిలబడలే,వార్డు మెంబర్ గా గెలవని నువ్వా నా గురించి మాట్లాడేది,జడ్పీటీసీ టికెట్,పైసలు ఆశించి మా పార్టీలోకి వస్తానని చెప్పిన మాట మరిసినవ అని ప్రశ్నించారు. మండేపల్లి గ్రామంలో భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నది వాస్తవం కాదా అని అన్నారు. మా గ్రామంలో ఎవరికి వైద్య సహాయం కావాలన్నా వాళ్లకు అండగా ఉన్నా,నేను డాక్టర్ల దగ్గర కమిషన్ లు తీసుకుంటానని ఆరోపిస్తవా..నా ఉర్లోకి వచ్చి నిరూపించాలని అన్నారు. ఇసుక ట్రాక్టర్ల దగ్గర పైసలు తీసుకున్నాది మర్చినవ,ఇవ్వకపోతే కేసులు పెట్టిస్తనని దాదాగిరి చేసింది నువ్వు అని అన్నారు. నేను మాదిగ జాతి బిడ్డను,నువ్వేం కులమో చెప్పాలి,నువ్వు మనిషి వి కాదు,మతిభ్రమించి మాట్లడుతున్న మృగానివి అని అన్నారు. నా గ్రామానికి సేవ చేస్తా,జిల్లాకే నా గ్రామం తలమానికం,నా ప్రజలకు నా గ్రామానికి ఎల్లవేళలా సేవ చేస్తానని అన్నారు.
నా ఊరు దేవాలయం నా ప్రజలలే దేవుళ్ళు,నా గ్రామాన్ని అభివృద్ధి చేసిన,నిలాగా దోచుకొని సంపాదించాలెఅని అన్నారు.యేండ్ల నుండి కబ్జాలో దున్నుకుంటున్న మా భూమిని నా భార్య పేరుమీద చట్టపరంగా చేసుకున్న,300 మందికి పట్టాలు ఇప్పించి, 50 మందికి ఇళ్ళ పట్టాలు ఇప్పిచ్చినా నీ లాగా దోచుకొని పని చేయలే అని అన్నారు.ఇన్ని రోజులు కేటీఆర్ సంకనాకి పనులు చేసుకుని,ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తారా,ఊర్లల్లో కేకే మహేందర్ రెడ్డి,నువ్వు తిరిగే పరిస్థితి లేదని తరిమికొట్టే పరిస్థితి ఉందని అన్నారు. ప్రెస్ మిట్ కు వచ్చేటప్పుడు కేటీఆర్ ఫోటో చూసి రా మహేందర్ రెడ్డి,అప్పుడు మాట్లాడు 5 సార్లు కేటీఆర్ మీద పోటీ చేసి ఓడిపోయిన సిగ్గులేదా అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కుర్మా రాజయ్య, సావన పెళ్లి పర్శరాములు,సీలివెరీ చిరంజీవి,మీసాల కృష్ణ,గుండు ప్రేమ్ కుమార్,కొయ్యడ రమేష్,ఇమ్మనేని అమర్ రావు,బండి జగన్,ఆత్మకూరి చంటి యాదవ్,గుండి మహేష్ ముదిరాజ్, గోడిసేలా ఎల్లయ్య,కర్నె బాలయ్య,దొంతినేని చందర్ రావు,నర్రా సతీష్ రెడ్డి,మసీపెద్దిశ్రీకాంత్ రావు,కృష్ణ రెడ్డి, కందుకూరు రామ గౌడ్,గోడిసేలా తిరుపతి,కడారి నవీన్ రెడ్డి,మాదారపు సత్తిరెడ్డి,నరేష్,పొన్నాలా చక్రపాణి, జీవన్,నరేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఒగ్గు లింఘం, పర్కపెల్లి తిరుపతి,బిక్షపతి, చెన్నామానేని రాజేశ్వర్ రావ్, సయ్యద్ అఫ్రోజ్ లు పాల్గొన్నారు.