ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్ల జారీపై తక్షణ చర్యలు తీసుకోవాలి..

0
36

పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అసిస్టెంట్ కలెక్టర్ కు వినతి

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఫీజుల పేరుతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కంచర్ల రవి గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజులు పూర్తిగా చెల్లించిన తర్వాతే హాల్ టికెట్ ఇస్తామని చెప్పి విద్యార్ధులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. పరీక్షలు దగ్గరపడుతున్న ఈ కీలక సమయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమని పేర్కొన్నారు. హాల్ టికెట్ ఇవ్వకుండా పరీక్షలకు దూరం చేయడం వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య ప్రతి విద్యార్ధికి హక్కు అని, ఫీజుల పేరుతో అడ్డంకులు సృష్టించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సంబంధిత కళాశాలలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుని ఎలాంటి షరతులు లేకుండా అన్ని ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు అందేలా చూడాలని జిల్లా అధికారులను కోరారు.

అలాగే, పరీక్ష కేంద్రాల్లో తగిన మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తాగునీరు, విశాల గదులు, ఫ్యాన్లు, సరైన కూర్చోవడానికి సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల కోసం వైద్య సిబ్బంది ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్.కె. అప్రోచ్, వడ్లూరి వేణు, మారం కార్తికేయ, నరేంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here