సిరిసిల్ల 18, డిసెంబర్ 2023:
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్లు పి. గౌతమి, ఎన్. ఖీమ్యా నాయక్ లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 20 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు.
అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజే యాలన్నారు.
కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ బి. గంగయ్య, DRDO నక్క శ్రీనివాస్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి లో శాఖల వారిగా వచ్చిన దరఖాస్తులు ఇవే!
Revenue – 10
EE MB – 1
MCSircilla – 3
DRDO – 1
Employment – 2
DMHO – 1
DPO – 1
Mc Vemulawada – 1
TOTAL – 20
అలాగే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.గౌతమి ని అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.