వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో సందర్శన
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ ఎన్నికలలో భాగంగా ఏర్పాటు చేసిన పలు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ బుధవారం పరిశీలించారు.
వీర్నపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ముస్తాబాద్ మండల కేంద్రం, ఆవునూర్ పాఠశాలల్లో, ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు.
ఈ పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, మండల ప్రత్యేక అధికారులు రాఘవేందర్, క్రాంతి కుమార్, ఎంపీడీఓలు లక్ష్మీనారాయణ, శ్రీలేఖ, నటరాజ్, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.

