కేసిఆర్ అంటేనే కాంగ్రెస్ కు వణుకు.. ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది..?
- బీఆర్‍ఎస్వీ నేత కంచర్ల రవి గౌడ్
బలగం టీవీ, సిరిసిల్ల:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై రాష్ట్ర మంత్రులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకుడు కంచర్ల రవి గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా బీఆర్‍ఎస్వీ నేత కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పేరు వింటేనే ఈ ప్రభుత్వానికి ఎందుకు వణుకు పుడుతోందో ప్రజలకు సమాధానం చెప్పాలని రవి గౌడ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ని చూసి ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ లేవనెత్తిన అంశాల్లో ఒక్కటైనా అబద్ధం ఉంటే ప్రభుత్వం ధైర్యంగా ఖండించాలని సవాల్ విసిరారు. చావు నోట్లో తలపెట్టి, గన్నుల మధ్య పోరాడి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. అప్పట్లో ఉద్యమకారులపై తుపాకీలు ఎక్కించిన చరిత్ర ఉన్న రేవంత్ రెడ్డికి కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. హామీల అమలు విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టదని, నిరంతరం వెంటాడుతుందని హెచ్చరించారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన ఘనవిజయమే కాంగ్రెస్ ప్రభుత్వంలో భయాన్ని నింపిందని, ఆ ఓటమి భయంతోనే కేసీఆర్‌పై నిందలు వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రులు వెంటనే వెనక్కి తీసుకోవాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆరెల్లి వినయ్ కుమార్, మీనవేని రాకేష్ నాయక్, యశ్వంత్, సాదుల శేఖర్, బూర విక్రమ్, గౌతమ్, జస్వంత్, వర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

