కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు, ఏపీ మంత్రి సుభాష్ దిష్టిబొమ్మ దగ్ధం…

0
59

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ నేతృత్వంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద మంత్రి సుభాష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన మహానేతపై విమర్శలు చేయడం తగదని రవి గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్ గురించి మాట్లాడే ముందు మంత్రి సుభాష్ తన రాజకీయ స్థాయిని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. చేసిన వ్యాఖ్యలకు గానూ మంత్రి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఉద్యమకారుల ఆగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు. “తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సహించే ప్రసక్తే లేదు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకుడిని అవమానించడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమే.

ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మట్టి శ్రీనివాస్, ఆరెల్లి వినయ్ కుమార్, రాకేష్ నాయక్, సాయికుమార్, అభిరామ్, మహేష్, ఎండి అజ్జు, నరేష్, రాము తదితరులు పాల్గొని మంత్రి సుభాష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here