బలగం టీవి, రాజన్న సిరిసిల్ల :
కొనరావుపెట్ మండలము వట్టిమల్ల గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభం మరియు కులసంఘాల భవనాలకు భూమి పూజ కార్యక్రమాలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారితో కలిసి ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి.
ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ అరుణ రాఘవ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రo ఏర్పడ్డాకే ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. కెసిఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వo విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపాలని కోరారు. కొనరావ్ పెట్ మండల ప్రజల ఆరోగ్య సౌకర్యార్థం మండలంలో 4 హెల్త్ సబ్ సెంటర్లు నిర్మాణం చేయడం జరిగిందన్నారు.అన్ని గ్రామాల్లో కులసంఘాల భవనాలకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది అన్నారు. మండలంలో జడ్పీ నిధులు 5 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేయడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో కోనరావుపేట మండల ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య,స్థానిక సర్పంచ్ కొమ్ము స్వప్న దేవరాజు ఎంపీటీసీ సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్య మండల ప్రజాప్రతినిధులు పలు గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీ లు వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు

