- బిజెపి మండల అధ్యక్షులు పరశురామ్
బలగం టీవీ, బోయినిపల్లి:
భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని శ్రీ రామాలయం ఆలయ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ: భారతీయ సనాతన ధర్మం ప్రపంచానికి అందించిన అపురూప కానుక యోగ. యోగ ద్వారా మనస్సు శరీరాన్ని ఏకం చేస్తుందని, శారీరక దృఢత్వాన్ని, మానసిక శాంతిని,ఆత్మశుద్ధిని చేస్తుందని,యోగ అనేక రుగ్మతలను తొలగిస్తుందని, యోగాను ప్రతిరోజు కార్యక్రమం లాగానే అలవర్చుకోవాలని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ యోగాను విశ్వవ్యాప్తం చేసి,నేడు దాదాపు 190 పైగా ప్రపంచ దేశాలు యోగాను అనుసరిస్తున్నాయి అన్నారు. చైనా అమెరికా జపాన్ వంటి దేశాలు తమ పాఠశాలల్లో యోగాను ప్రవేశపెట్టాయన్నారు.వన్ ఎర్త్ వన్ హెల్త్,ప్రపంచ శాంతిని ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేది భారతదేశం అన్నారు.
ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు శ్రీపతి కృష్ణ హరి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదాహరి నరసింహాచారి, మాజీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ,జువ్వెంతుల శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల శరత్ చంద్రారెడ్డి, రాజూరి కిరణ్, మెరుపుల గంగాధర్ గౌడ్, గొట్ల అయిలయ్య, సావనపెళ్లి అనిల్, కళ్యాణం అనిల్, చిలుమల రమేష్ శేఖర్, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

