బలగం టివి, ,రాజన్న సిరిసిల్ల:
–కలెక్టర్ ను కలిసిన అదనపు పీఆర్ఓ
ప్రభుత్వ పథకాలను సమాచారాన్ని ప్రజలకు చేర్చడంలో, ప్రజా స్పందనను ప్రభుత్వానికి చేరవేయడంలో సమాచార శాఖ కీలకం కలెక్టర్ అనురాగ్ జయంత్ అన్నారు.బుధవారం
ఇటీవల బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన పలువురు అధికారులు కలెక్టర్ అనురాగ్ జయంతిని బుధవారం కలిశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోనిఛాంబర్లో కలెక్టర్ ను జిల్లా పౌర సంబంధాల అధికారి(ఏడీ) దశరథంతో కలిసి అదనపు పౌర సంబంధాల అధికారి శారద కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మాట్లాడారు.జిల్లా యంత్రాంగం , అన్ని ప్రభుత్వ శాఖల నుండి మీడియా కు అధికారికారిక సమాచారం అందించే ప్రతినిధి సమాచార శాఖ అన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలకు సమాచారం ప్రజలకు చేర్చి ప్రతి ఒక్కరు పథక ఫలాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. విధుల్లో చేరిన ఉద్యోగులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. మెరుగైన సేవలు అందించి, మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. అంతకుముందు నూతన జెడ్పీ సీఈఓ ఉమారాణి, డీపీఓ వీరబుచ్చయ్య, డీఆర్డీఓ శేషాద్రి లు కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి లను కలెక్టరేట్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు.