టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మహిళలకు అన్యాయం: బీఆర్ఎస్ నేత దాసరి ఉష

0
185

బలగం టీవీ, హైదరాబాద్‌:

తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్‌కు సంబంధించి మహిళా అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందని అన్నారు.

మొత్తం 753 పోస్టులకు గాను మహిళలకు 259 పోస్టులు రావాల్సి ఉండగా, కేవలం 169 పోస్టులు మాత్రమే ఇచ్చారని అన్నారు. మహిళా రిజర్వేషన్ల ప్రకారం మహిళా అభ్యర్థులకు దక్కాల్సిన 90 పోస్టులు రాలేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జనరల్ పోస్టులను మహిళలకు ఇవ్వడం లేదని అన్నారు.

ఓసీ కేటగిరీలో 99 పోస్టులకు గాను మహిళలకు కేవలం 52 పోస్టులు మాత్రమే వచ్చాయని, ఈడబ్ల్యుఎస్ (EWS) కేటగిరీలో ఒక్క మహిళా అభ్యర్థికి కూడా పోస్టు దక్కలేదని, ఓబీసీ (OBC) కేటగిరీలో 59 మంది మహిళలకు రావాల్సిన పోస్టులకు గాను 72 పోస్టులు మహిళలకు వచ్చాయని తెలిపారు.

మొత్తంగా 109 మంది మహిళా అభ్యర్థులు నష్టపోయారని దాసరి ఉష అన్నారు. ఈ విషయమై టీఎస్‌పీఎస్సీ (TSPSC)ని అడిగితే, తదుపరి నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తామని చెబుతున్నారని, ఇది సరికాదని అన్నారు. మహిళలకు న్యాయబద్ధంగా రావాల్సిన పోస్టులను వెంటనే ఇవ్వాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here