బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ తోట ఆగన్న
రాజన్న సిరిసిల్ల జిల్లా, వెంకటాపూర్ బైపాస్ రోడ్డు వెంబడి నీడు ఏర్పాటు చేసిన వాల్ పెయింటింగ్‌లను బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ తోట ఆగన్న పరిశీలించారు. ఈ పెయింటింగ్‌లు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవేశపెట్టిన రైతు బంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, నేతన్న భీమా, రైతు భీమా వంటి ప్రజాకర్షక పథకాలను వివరిస్తూ రూపొందించబడ్డాయి.

ఈ సందర్భంగా శ్రీ తోట ఆగన్న మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని, ఈ పథకాలు రైతులు, దళితులు, మహిళలు మరియు నేతన్నల జీవనోపాధికి ఎంతగానో దోహదపడ్డాయని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ఈ వాల్ పెయింటింగ్‌లు ప్రజలకు ఈ పథకాల గురించి మరింత అవగాహన కల్పిస్తాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
