హైదరాబాద్: నగరంలోని జిల్లెలగూడలో ఇంటర్ విద్యార్ధి వైభవ్ మంగళవారంనాడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు వైభవ్ సూసైడ్ నోట్ రాశాడు. ఎక్కువ మార్కులు రావాలని కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా వైభవ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
హైద్రాబాద్ చైతన్యపురిలోని ఓ కార్పోరేట్ కాలేజీలో వైభవ్ ఇంటర్ చదువుతున్నాడు. ఈ కాలేజీలో ఎవరూ కూడ చేరవద్దని కూడ వైభవ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడ ఇంటర్ పరీక్ష ఫెయిల్ అవడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు నమోదయ్యాయి.
ఆత్మహత్యలు పరిష్కారం కాదు
చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదౌతున్నాయి. అయితే ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యలకు పరిష్కారాన్ని సూచించవని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆత్మహత్యలు చేసుకోవాలన్న ఆలోచన వస్తే మానసిక వైద్యులను కలవాలని సూచిస్తున్నారు. జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.