బలగం టీవీ, హైదరాబాద్:
లేబర్ డే సందర్భంగా ఖతర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మరియు వర్కర్స్ సపోర్ట్ ఇన్సూరెన్స్ ఫండ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన “వర్కర్స్ ఇంటర్నేషనల్ డే సెలబ్రేషన్స్” కార్యక్రమంలో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సంస్థలు పాల్గొని కార్మిక సేవల పట్ల తమ అంకితభావాన్ని ప్రదర్శించాయి.
ఈ ప్రతిష్టాత్మక వేదికపై ఖతర్‌లో తెలుగు కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ గల్ఫ్ సమితికి అవార్డు లభించడం గర్వకారణంగా నిలిచింది. ఈ అవార్డు కేవలం ఒక సంస్థకు వచ్చిన గౌరవం మాత్రమే కాకుండా, విదేశాల్లో శ్రమిస్తున్న ప్రతి తెలుగు కార్మికుడి కృషికి లభించిన గొప్ప గుర్తింపుగా భావించబడుతోంది.
ఈ విజయానికి వెనుక ఎన్నో కనిపించని చేతులు, త్యాగాలు, నిరంతర శ్రమ దాగి ఉన్నాయి. సంస్థ కోసం నిస్వార్థంగా సేవలందించిన ప్రతి సభ్యుడు, వాలంటీర్, మద్దతుదారులకు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వారి అంకితభావం, సేవా స్పూర్తి, ఐక్యత వల్లే ఈ గౌరవం సాధ్యమైంది.
ఈ గౌరవాన్ని ఖతర్‌లో నివసిస్తున్న ప్రతి తెలుగు ప్రజలకు అంకితం చేస్తూ, భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామని తెలంగాణ గల్ఫ్ సమితి ప్రతినిధులు తెలిపారు.
