బలగం టీవీ, హైదరాబాద్ :
తెలంగాణ భవన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా నష్టపోతున్న మహిళలు, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని,మహిళా రిజర్వేషన్లు అమలుకానందు వల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యాన వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని జనగణనకు బడ్జెట్ లో ఎందుకు నిధులు పెట్టలేదని, త్వరగా జనగణన చేస్తే.. రాబోయే బిహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలవుతారని అన్నారు.
ప్రతీ మహిళకు రూ 2500 ఇస్తామన్న హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని,మహిళా సంఘాల ద్వారా అద్దెకు తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలని, అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం సరికాదని మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం బహీర్గతం చేయాలని అన్నారు.
కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశారని,మహిళల కోసం కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని కేసీఆర్ పెట్టిన పథకాలను తీసేసే కర్కోటక ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళా, పురుషుల సమానత్వపు బొమ్మలు ప్రచురిస్తున్నారని అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉందని అన్నారు. సమాజం ఎదుగుదలలో మహిళల పాత్ర గణనీయమని ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉందని అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు.
చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వీర మహిళలు తెలంగాణ గడ్డపై పుట్టడం మనకు గర్వకారణమని, మహిళలకు కులమతాలు లేవని మహిళలది ఒకే కులమని మహిళలలు ఐక్యంగా ఉండి హక్కులనుసాధించుకోవాలని, ఇళ్లలో మహిళలు ద్వితియ శ్రేణి పౌరులుగా ఉంటున్నారన్న వాదన వీగిపోవాలని అమెరికా 40 శాతం మహిళలు ఉద్యోగాలు చేస్తుంటే భారత్ లో మాత్రం అది 17 శాతంగానే ఉందని అన్నారు. దేశంలో 50 శాతం మహిళలు ఉద్యోగాలు చేస్తే దేశ జీడీపీకి మనం 5 లక్షల కోట్ల ఆదాయం ఇవ్వగలుగుతామని కానీ మహిళలు ఉద్యోగాలు చేయదగడానికి గల సౌకర్యాలు ఉన్నాయా ? అన్నది ఆలోచించాలని భూగర్భ గనులల్లో పనిచేయడం నుంచి అంతరిక్షంలోకి వెళ్లే వరకు మహిళలు ఎదిగారని అయినా అనేక అవాంతరాలు ఉన్నాయని వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని అన్నారు.


