బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత – నలినీకాంత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటైజర్ సిబ్బందికి, రన్నింగ్ పోటీలలో ముందంజలో ఉండి పథకాలు సాధించిన అందరి అమ్మైనా రామానుజమ్మ కి కూడా సన్మానం చేయడం జరిగిందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెలంగాణ స్టేట్ లక్ష పైచిలుకు సభ్యత్వాలు చేసి అన్ని రాష్ట్రాల్లో కంటే ముందంజలో ఉంది మహిళా సాధికారిత దిశా దేయంగా ముఖ్యమంత్రి ప్రతి దాంట్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తానని చెప్పిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో భాగంగానే ప్రతి ఒక్క మహిళకు సమైక్య సంఘాల నుంచి క్యాంటీన్లో, సమైక్య సంఘాల నుండి బస్సులు కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా కూడా మహిళలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి చేస్తున్నారని, ప్రతి ఒక్క మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ మరి ఇంకెన్నో మంచి మంచి పథకాలు మహిళలకు అందేలా చేస్తున్న మన ముఖ్యమంత్రివర్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి జిల్లా మహిళా కాంగ్రెస్ తరపున శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలైన మడుపు శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, టౌన్ ప్రెసిడెంట్ సామల రోజా, కోడం సుధా, బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి, వాటి అధ్యక్షురాలు లత, రోజా, మంజుల, కాంగ్రెస్ నాయకురాలు, వార్డు కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.