బలగం టీవి ,ముస్తాబాద్.
ముస్తాబాద్ మండల వనరుల కేంద్రం టిపిటిఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్,డైరీలను ఆవిష్కరించడం జరిగింది. మండల విద్యాధికారి విద్యాధికారి బుఖ్య బన్నాజీ మండల్ నోడల్ అధికారి రాజిరెడ్డి కాంప్లెక్స్ హెచ్ఎం రాధా కిషన్ రావు,లక్ష్మణ్,రవి,రవీందర్ రెడ్డి రాజ్ కుమార్,సుధాకర్, నరేందర్ రెడ్డి,శివ శంకర్ పలు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో టి ఫి టి ఎఫ్ మండల అధ్యక్షుడు ఓలాద్రి ఎల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి డి మధుసూదన్ పాల్గొని నూతన ప్రభుత్వంలో ఉపాధ్యాయుల డిమాండ్లను బదిలీలు అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి పెండింగ్ లో ఉన్న డీఎ లను చెల్లించాలని పేర్కొన్నారు.అలాగే పదోన్నతులు వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.