బలగం టీవి ..గంభీరావుపేట
గంభీరావుపేట మండలం దమ్మన్నపేట
మోడల్ స్కూల్‌లో 2024-25విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, 7నుంచి పదో తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లలో భర్తీ కోసం ఈ నెల12 తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు దరకాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న కాపీలను మోడల్ స్కూల్‌లో అందించాలన్నారు. 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 7న,ఉదయం 10గంటల నుంచి మద్యాహ్నం 12గంటల వరకు, 7 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ప్రవేశానికి మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.