బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.
జనవరి 08న తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ గా బోయినిపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన గొర్రె కిషన్ నియమించినట్లు జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ ఆకునూరి బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నియామక పత్రంను బోయినిపల్లి మండల నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా గొర్రె కిషన్ మాట్లాడుతూ: నా నియామకానికి సహకరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కూస రవీందర్,సింగిల్ విండో చైర్మన్ వేసిరెడ్డి దుర్గారెడ్డి, మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నియామక పత్రం అందజేసిన వారిలో సింగిల్ విండో చైర్మన్ వేసిరెడ్డి దుర్గారెడ్డి,మానువాడ సర్పంచ్ రామీడి శ్రీనివాస్, సంధి సంపత్ కుమార్, లవన్ తదితరులు ఉన్నారు