–కలెక్టర్ అనురాగ్ జయంతి
బలగం టివి ,సిరిసిల్ల:
ఉత్తమ, పారదర్శకమైన సేవలు అందించినందుకు గానూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ రాష్ట్రంలోనే ఉత్తమ సేవల విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం హర్షణీయమని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. 2023 సంవత్సరంలో మొత్తం 79,365 మంది రోగులకు 2,54,410 వైద్య పరీక్షలు చేసినందుకు గానూ ఉత్తమ సేవల విభాగంలో రాజన్న సిరిసిల్ల టీ హబ్ ప్రథమ స్థానం పొందగా జనవరి 26 వ తేదీన టీ హబ్ కో- ఆర్డినేటర్ రాంప్రసాద్ మెమోంటో స్వీకరించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల టీ హబ్ సిబ్బంది శనివారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. టీ హబ్ కు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం దక్కడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు డా.సంతోష్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు, వైద్యులు డా.మనీష్, డా.విమల, డా.శ్వేత, డా.క్రాంతి రేఖ, కో ఆర్డినేటర్ రాంప్రసాద్, సిబ్బంది హారిక, జనార్ధన్, సత్యనారాయణ, శ్వేత, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.