బలగం టివి, రాజన్న సిరిసిల్ల
బీసీ కులగణన తో సామాజిక న్యాయం
ఇక బీసీ లకు మంచిరోజులే! !!!
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో బీసీ కులగణన చేపట్టాలని రాష్ట్ర అసెంబ్లీ లో ఏకగ్రీవంగా తీర్మాణం చేయడం పట్ల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు హర్షం వ్యక్తం చేశారు, శనివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు హాజరైనారు, ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ బీసీ కులగణన చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ లో ఏకగ్రీవంగా తీర్మాణం చేయడం ఓ చారిత్రాత్మక నిర్ణయం అన్నారు, బీసీ కులగణన తో సామాజిక న్యాయం తో పాటు విద్యా ఉద్యోగ ఆర్ధిక రాజకీయ రంగాలలో బీసీ లకు జనాభా ప్రాతిపదికన వాటా దక్కుతదని పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు, బీసీ లకు ఇక అన్ని మంచి రోజులేనని స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ లకు 42% ప్రాతినిధ్యం దక్కబోతున్నదని పర్శ హన్మాండ్లు అన్నారు, బీసీ కులగణన దేశ వ్యాప్తం గా చేపట్టాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ డిమాండు చేస్తున్నారని అందులో భాగం గా తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే తెలంగాణా లో ఆచరణ లోకి తీసుకరావడం కాంగ్రెస్ పార్టీ చిత్త శుద్ది కి నిదర్శనం అని పర్శ హన్మాండ్లు అన్నారు, ఎన్నికల హామీ లను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తదనే నమ్మకం ఏర్పడుతుంధని పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి, సీఎం రేవంత్ రెడ్డి కీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరో మంత్రి కొండా సురేఖ లకు బీసీ సంక్షేమ సంఘం పక్షాన పర్శ హన్మాండ్లు ధన్యవాదములు చెప్పారు, ఈ సమావేశం లో నాయకులు తడక కమలాకర్, కందుకూరి రామాగౌడ్, దేశపాండే ఆంజనేయులు, కంచర్ల రవి గౌడ్, బట్టు ప్రవీణ్, శ్రీనివాస్ .శ్రీగాధ గణేష్ ,బట్టు ప్రవీణ్, ఎలుక రాజు, మామిండ్ల భూపతి ,గజ్జెల రాజు, ఇల్లంతకుంట తిరుపతి, చొక్కి కాయిలాష్,పెర్క గంగరాజు నంద్యాడపుశ్రీనివాస్,శ్యామ్ ,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.