బలగం టివి, తంగళ్ళపల్లి
: జిల్లా సర్పంచుల ఫోరం మాజి అధ్యక్షుడు మాట్ల మధు
అభివృధ్ది అంటే ఏంటో తెల్వను బండి సంజయ్ కూడా కేటీఆర్ ను విమర్శించడం హాస్యాస్పదం .ఎన్నికలు రాగానే ఎంపీ అనే విషయం గుర్తుకు వస్తదా? బండి సంజయ్ అంటూ ఏద్దేవా , ప్రజలు నమ్మే స్థితిలో లేరు . మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు , మరోసారి కేటీఆర్,వినోద్ కుమార్ లను విమర్శిస్తే ఊరుకోనేది లేదని హెచ్చరిక , నిన్ను ఎంపీగా గెలిపిస్తే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఏం అబివృద్ధి చేసావో చెప్పాలి , తంగళ్ళపల్లి మండలానికి ఎన్ని నిధులు మంజూరు చేసావో చెప్పి యాత్ర చేస్తే బాగుండు, సంవత్సరానికి రూ.5 కోట్ల ఎంపీ ల్యాండ్స్ నిధులు ఉంటే సిరిసిల్లకు ఎన్ని ఖర్చు చేసావో చెప్పు, అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుండి హక్కుగా రావాల్సిన నిదులే మీరూ ఇచ్చేది , వాటిని కూడా మేమే ఇచ్చామంటు జబ్బలు చర్చు కోవడం విడ్డూరంగా ఉంది , సిరిసిల్లకు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని నిధులు తెచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి , పార్లమెంట్ లో సిరిసిల్ల ప్రజల సమస్యలను ప్రస్తావించని నువ్వా వినోద్ కుమార్ ను విమర్శించేది , వినోద్ కుమార్ పని తనానికి నీ పని తనానికి నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉంది , సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేటీఆర్ పైనా నీ ఆరోపణలు , ఎన్నికల కోసమే బండి సంజయ్ ప్రజా హిత యాత్ర మొదలు పెట్టిండు , రానున్న ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు నీకు కర్రు కాల్చి వాత పెట్టడం కాయం , బీజేపి నీ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.. కేటీఆర్,వినోద్ కుమార్ పై మరోసారి అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదు
ఈ కార్యక్రమంలో సారంపల్లి మాజీ సర్పంచ్ రమేష్ ,బీఆర్ఎస్ యూత్ నేత సిలివేరి చిరంజీవి ఫ్యాక్స్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, నీరేటి బాబు, ఆత్మకూరు చంటి యాదవ్, అమర్ రావు ,md హమీద్, బల్లెపు సిద్ధన్న, నిరేటి బాబు, అడగట్ల చంద్రం, తదితరులు ఉన్నారు