బాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేత
బలగం టివి,, తంగళ్లపల్లి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పరకపల్లి తిరుపతి కి చెందిన తన యొక్క మేకల షెడ్ లో మేకలపై కోళ్లపైన కుక్కలు దాడి చేయడంతో ఆరు గొర్రెలు 20 కోళ్లు మృతి చెందాయి. దాడి జరిగిన విషయాన్ని తెలుసుకొన్న కోడి అంతయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఘటన విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితునికి సహాయం అందేలా చొరవ తీసుకుంటానని వెల్లడించారు.