–మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
బలగం టివి,వేములవాడ:
రోడ్డు ప్రమాదాల్లో బంగారు భవిష్యత్తు ఉన్న యువకులను కోల్పోవడం చాలా బాధాకరమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీకి చెందిన తేజ ఆదివారం రాత్రి బాలానగర్ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆది శ్రీనివాస్ సోమవారం ఉదయాం మృతుడి ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.. దైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, యూత్ నాయకులు మండలోజు సందీప్ తదితరులు పాల్గొన్నారు.