బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
బీఆర్ఎస్ నాయకులు బోల్లి రామ్మోహన్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెళ్ల గ్రామనికి చెందిన సామాన్య రైతు అబ్బాడి రాజిరెడ్డిని అధికారులంతా కలిసి ఒక అక్రమ కేసును బనాయించి ఇటీవల జైలుకు పంపారు. తనకు అండగా మేమున్నామని బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం రోజున పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పించి మాట్లాడుతూ ఒక పక్క పోలీసులు గానీ ఇంకోపక్క అధికారులు కానీ ఎటువంటి కనికరం చూపకుండా అబ్బడి రాజిరెడ్డి ని జైలుకు పంపరని ఒక రైతు చిరకాలంగా తండ్రుల నుంచి దున్నుకుంటున్న భూమిని తన పేరు మీద 2018లో పి ఓ టి చట్టం ప్రకారం అప్పటి రెవిన్యూ అధికారులు ఎమ్మార్వో,వీఆర్వో, ఆర్ఐ వాళ్ళందరు పరిశీలించిన అనంతరం పేరు మార్పిడి జరిగిందని పి ఓ టి చట్టం రాష్ట్రవ్యాప్తంగా అమలయిందని దాని ద్వారానే మార్పులు చేర్పులు జరిగాయని, లావని పట్టా భూములు ప్రభుత్వానికి అవసరం ఉంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాని రాజకీయ కుట్రతో రాజకీయ కక్షతో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి కానీ ఇలాంటి సామాన్య రైతుల కన్నీటిని పెట్టించద్దని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా బి ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.