శివరాత్రి జాతరలోగా పూర్తి చేయాలి..

0
50

వీటీఏడీఏ పనుల్లో వేగం పెంచాలి

  • జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.

బలగం టీవీ, వేములవాడ:

వీటీఏడీఏ ఆద్వర్యంలో వేములవాడ లో చేపట్టిన పనులను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం పరిశీలించారు.

ముందుగా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ నుంచి చెక్కపల్లి చౌరస్తా మార్గంలో వీటీఏడీఏ నిధులతో ఆర్ అండ్ బీ శాఖ ఆద్వర్యంలో చేపడుతున్న పనులపై ఇంచార్జి కలెక్టర్ ఇప్పటికే ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించగా, నేడు క్షేత్ర స్థాయిలో రోడ్డు పనులను ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణంతోపాటుగా మురుగు కాలువల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం పనులు శివరాత్రి జాతరలోగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత పాటిస్తూ, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.

వేములవాడ ప్రధాన రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలి..

వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయ వరకు రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయ వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. రోడ్డు వెంట కాలినడకన వెళ్లి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రధాన రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విస్తరణ పనులు, అభివృద్ధి పనులపై ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శివరాత్రి లోగా మెజార్టీ పనులు పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

గుడి చెరువు బండ్ పార్క్ ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ గుడి చెరువును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఆలయ గుడి చెరువు వద్ద టూరిజం శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. చెరువు ప్రవేశ ద్వారం నుంచి మొదలు చివరి వరకు ఏర్పాటు చేసిన విగ్రహాలు, విద్యుత్ దీపాలు, మొక్కలు, ఫౌంటెన్ అన్నింటినీ కాలినడకన తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి పనికి సంబంధించి మ్యాప్ లు పరిశీలించి, క్షేత్రస్థాయిలో చేసిన పనులను చూసి అధికారులకు పలు సూచనలు చేశారు. తుది దశ పనులను వేగంగా పూర్తి చేసి పట్టణ ప్రజలు, భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

నాంపల్లి గుట్ట పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం

వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి గుట్ట త్వరలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. నాంపల్లి గుట్టపై ప్రసాదం కౌంటర్ సమీపంలో పనులు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. పనుల పురోగతి పరిశీలించి.. జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిశోర్ కుమార్ కు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. భక్తులకు ఆహ్లాదం పంచేందుకు పనులు.. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానాన్ని, ఇతర పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ర్యాంప్ ఏర్పాటు చేయాలని, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

ఈ పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, పబ్లిక్ హెల్త్ డీఈ వరుణ్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, టీపీఓ అన్సార్ ఆర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు. టీపీఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here