బలగం టివి,రుద్రoగి:
ఆరోగ్యం సరిగా లేని మానసిక వికలాంగురాలిపై మానవత్వం మరిచి అత్యాచార యత్నానికి ప్రయత్నించిన బుక్క రామచంద్రం (55) కు రెండేళ్ల జైలు శిక్ష,పదివేల రూపాయల జరిమానా విధిస్తూ వేములవాడ ఇన్చార్జి మెజిస్ట్రేట్ ప్రవీణ్ శుక్రవారం తీర్పునిచ్చారు.. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఇద్దరు భార్యాభర్తలు వ్యవసాయం చేస్తూ జీవిస్తారు.వీరి చిన్న కూతురు మానసిక వికలాంగురాలు,ఆరోగ్యం సరిగా ఉండని అమ్మాయి ఇంటి వద్దనే ఉంటున్నది.. 2018 ఫిబ్రవరి 2న తల్లిదండ్రులు బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిపై మధ్యాహ్న సమయం లొ అదే ప్రాంతానికి చెందిన బుక్క రామచంద్రం అలియాస్ రాములు( 55) అత్యాచార యత్నానికి ప్రయత్నించగా అమ్మాయి అరవడంతో పారిపోయాడు. ఈ సంఘటనపై బాధితురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రుద్రంగి ఎస్సై విద్యాసాగర్ రావు నిందితుడు రామచంద్రంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఈ కేస్ లో వేములవాడ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విక్రాంత్ పెద్ది సాక్షులను ప్రవేశపెట్టి విచారించారు.. సాక్షాధారాలు పరిశీలించిన మెజిస్ట్రేట్ ప్రవీణ్ నిందితుడు రామచంద్రం కు జైలు శిక్ష, 10వేల రూపాయల జరిమానా విధించారు..